Prabhas: హను రాఘవపూడి దర్శకత్వంలో మరిన్ని చిత్రాలు 7 d ago

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'ది రాజా సాబ్' చిత్రంతో పాటు ప్రభాస్ 'ఫౌజీ' అనే చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించారని, ఇది ప్రభాస్ కెరీర్‌లోని అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోతుందని సమాచారం.